తండ్రిని స్మరించుకున్న మెగాస్టార్
Nagababu- chiru
నాన్న గారి సంవత్సరీకం సందర్భంగా ఆయన స్మృతులని తలుచుకుంటూ, మాకు జన్మనిచ్చిన ఆ మహనీయుడు ఏ లోకంలో వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అంటూ ట్వీట్ చేశారు.
సమాజం కోసం తపించే ముగ్గురు మొనగాళ్లను ఇచ్చిన మహానుభావుడు "వెంకటరావు" గారి ఆత్మకు తప్పకుండా సద్గతి కలిగి ఉంటుందని ట్విట్టర్‌లో కొందరు స్పందించారు. ఇదిలా వుండగా, గురువారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసారు. చిరు తన పెరట్లో కొన్ని నెలల క్రితం పొట్లకాయ విత్తనాలను నాటగా, అది పెరిగి, ఇప్పుడు పొట్లకాయలు కూడా అయ్యాయట.
పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి నా సెల్యూట్” అంటూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
