మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (18:28 IST)

చిరంజీవి హీరో వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు దాన‌య్య నిర్మాత‌

DVV Danayya, Chiranjeevi, Venki Kudumala
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించ‌బోయే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమ‌ల డైరెక్టర్. ఆర్‌.ఆర్‌.ఆర్‌. వంటి  భారీ పాన్ ఇండియా మూవీని నిర్మించిన త‌ర్వాత డివివి దాన‌య్య నిర్మిస్తోన్న మరో భారీ చిత్ర‌మిది. డాక్టర్ మాధవి రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత డివివి దాన‌య్య మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవిగారితో సినిమా చేయాలని ప్రతి నిర్మాతకు కోరిక ఉంటుంది. అలాగే నేను కోరుకున్నాను. నా బ‌ల‌మైన కోరిక‌కు మ‌రో బ‌లం తోడైంది. అదే ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల. ఎందుకంటే ఛలో, భీష్మ వంటి వరుస విజయాలను సాధించిన దర్శకుడు వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని. ద‌ర్శ‌కుడిగా చిరంజీవితో సినిమా చేయాల‌నేది ఆయ‌న డ్రీమ్‌. ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చింది. మెగాభిమానుల‌ను ఎంటర్‌టైన్ చేసే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఇది. త్వ‌ర‌లోనే ఇందులో ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం ’’ అన్నారు.