బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (09:41 IST)

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ మెగా రికార్డ్!

chiru movies
డిసెంబర్ నెలలో మెగాస్టార్ చిరంజీవి ప్రపంచంలోనే సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారు. నాలుగు సినిమాలు షూట్ అవుతున్నాయి. స‌హ‌జంగా యూత్ హీరోలు చ‌కా చ‌కా సినిమాలు చేయ‌డం మామూలే. కానీ ఒక వ‌య‌స్సు వ‌చ్చాక కూడా ఇంత స్పీడ్‌గా షూటింగ్‌లు చేయ‌డం ప‌ట్ల చిరంజీవి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ ఒక‌సారి ఆలోచించుకుంటే డిసెంబ‌ర్ నెలలో తాను చేస్తున్న సినిమాలు త‌న‌కే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయ‌ని పేర్కొంటూ ట్వీట్ చేశారు. 

 
అందులో చిరు152 #ఆచార్య, 153 గాడ్ ఫాదర్, కొద్దిరోజులకే యంగ్ డైరెక్టర్ బాబీతో 154వ సినిమా సెట్లో అడుగుపెట్టారు. ఇక ఈ రెండు కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ని పట్టాలెక్కించారు. డిసెంబ‌ర్ నెల మెగాఫీస్ట్ అంటూ స్పందిస్తున్నారు. 

 
ఒక‌ప్పుడు సూప‌ర్ స్టార్ కృష్ణ రాత్రి ప‌గ‌లు అనే తేడాలేకుండా ఏక‌ధాటిగా షూటింగ్ చేసిన సంద‌ర్భాలున్నాయి .ఆ త‌ర్వాత చిరంజీవి ఇలా చేశారు. ఒకప్పుడు చిరు ఒకే ఏడాది నాలుగు అంతకంటే చిత్రాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఒక్క నెలలోనే నాలుగు సినిమాల షూటింగ్స్ చేస్తూ ఒకే నెలలో అత్యధిక చిత్రాలు చేసిన స్టార్ హీరోగా చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ డిసెంబర్ లోనే ఈ నాలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రపంచంలో ఒకే నెలలో అత్యధిక షూటింగ్‌లు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారంటూ ఫ్యాన్స్ చిరుకు ట్వీట్‌లు చేస్తున్నారు.