బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (13:35 IST)

06-12-2021 సోమవారం రాశిఫలాలు : శంకరుడిని పూజించినా మీ సంకల్పం...

మేషం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు మొండివైఖరి అవలంభించుట వల్ల మాటపడక తప్పదు. తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు వాయిదాపడుట వల్ల ఆందోళన చెందుతారు.
 
వృషభం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు అధికమవుతాయి.
 
మిథునం :- చిన్నారులు, ఆత్మీయులకు విలువైన కానకలందిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. సొంత వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయటం శ్రేయస్కరం.
 
కర్కాటకం :- సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. విద్యార్థినులకు ప్రతి విషయంలోను ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. వేడుకలు, దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
సింహం :- వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. ఒక మంచి పని చేశామన్న సంతృప్తి మీలో నెలకొంటుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. అధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి.
 
కన్య :- ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. జాగ్రత్త వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
తుల :- వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందు లెదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు అంతగా ఫలించకపోవచ్చును. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు.
 
వృశ్చికం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
ధనస్సు :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆహార వ్యవహారాల్లో మొహమ్మాటలకు తావివ్వకండి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. బంధువుల రాకపోకలు పునరావృతమవుతాయి. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. బంధువుల రాకతో కుటుంబములో సందడి నెలకొంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి.
 
కుంభం :- పత్రికా రంగంలోని వారికి ఆందోళన తప్పదు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమించిన కొలదీ ఫలితం అన్నట్లుగా ఉంటుంది. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి, స్త్రీలకు షాపింగులోను, చెల్లింపులలోను అప్రమత్తత అవసరం. బంధు మిత్రులతో పరస్పర కానుక లిచ్చిపుచ్చుకుంటారు.
 
మీనం :- ఆర్థిక, లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మొహమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.