1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today Daily Astrology dated on 4th December'2021

04-12-2021 శనివారం రాశిఫలాలు : ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించిన...

Daily Horoscope
మేషం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా గుర్తింపు, రాణింపు లభిస్తుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
 
మిధునం :- ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమంచి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. మీ మిత్రుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది.
 
కర్కాటకం :- కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి అధికమవుతుంది. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. 
 
సింహం :- ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. వ్యాపారస్థులు అధిక శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. బంధువులను కలుసుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగువేస్తారు.
 
కన్య :- ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం వంటివి తప్పవు. ఎలర్జికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. సోదరులతో ఏకీభవించ లేకపోతారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
తుల :- అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పవు. రవాణా, ఎక్స్‌పోర్ట్, రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు ఎదటివారితో మితంగా సంభాషించటం ఉత్తమం.
 
వృశ్చికం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ధనం ఏ మాత్రం ఆదా చేయలేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. 
 
ధనస్సు :- వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెకుకువ చాలా అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత పొందుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
మకరం :- బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చిరాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రయత్న పూర్వకంగా మొండి బాకీలు వసూలు కాగలవు. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి.
 
మీనం :- భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి. ఎటువంటి చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు.
About Writer
రామన్
తర్వాతి కథనం
05-12-2021 నుంచి 11-12-2021 వరకు మీ వార రాశిఫలితాలు