గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-12-2021 శుక్రవారం రాశిఫలాలు : లక్ష్మీ కుబేరుడిని ఆరాధించిన మనోసిద్ధి...

మేషం :- రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోను ప్రయాణాలలోను మెళుకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. దూర ప్రయాణాలలో ఒత్తిడి అధికమవుతుంది.
 
వృషభం :- కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఏదన్నా అమ్మకానికి లేక కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. పాత వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
మిథునం :- మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకపోకలు పునరావృతమవుతాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి.
 
కర్కాటకం :- ఏదన్నా అమ్మకానికి లేక కొనడానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. శకునాలు, పొరుగువారి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. వాహనం వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి వస్తుంది. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
సింహం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు టి.వి., కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు.
 
కన్య :- హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. శ్రమాధిక్యత, మానసికాందోళన వల్ల అనారోగ్యానికి గురయ్యే ఆస్కారం ఉంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జప్తికి రాగలవు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
తుల :- స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు అంతగా ఫలించక పోవచ్చును. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం శ్రేయస్కరం. ఊహించని ఖర్చువల్ల చేబదుళ్ళు వంటివి తప్పవు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
వృశ్చికం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. పట్టింపుల వల్ల స్త్రీలు విలువైన అవకాశాలు కోల్పోయే ఆస్కారం ఉంది. శత్రువులు మిత్రులుగా మారిసహాయం అందిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
ధనస్సు :- వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవసాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.
 
మకరం :- విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని పొందుతారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడతాయి. సహోద్యోగులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పొదుపు పథకాలపై శ్రద్ద వహించండి.
 
కుంభం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఆలయాలను సందర్శిస్తారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. బంధువులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు.
 
మీనం :- ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది. కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య ప్రేమ, వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.