గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-11-2021 మంగళవారం రాశిఫలాలు : ఆంజనేయస్వామిని ఆరాధిస్తే శుభం...

మేషం :- కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. వృత్తుల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది.
 
వృషభం :- ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. మీ ఆలోచనలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
మిథునం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు ఆశాజనకం. చేపట్టిన పనుల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలం. స్త్రీలకు దైవకార్యాలు, ఉపవాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
కర్కాటకం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధు మిత్రుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో హామీలు ఉండటం క్షేమదాయకం కాదని గమనించండి. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాల పైనే మీ ఆలోచనలుంటాయి.
 
సింహం :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. కోర్టు వ్యవహరాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
కన్య :- ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు అవార్డు వంటి శుభఫలితాలుంటాయి. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
తుల :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
వృశ్చికం :- స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యలయాలలోని పనులు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
ధనస్సు :- హోటల్, క్యాటరింగ్ పనివారలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఖర్చులు పెరగడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలున్నాయి.
 
మకరం :- వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కుంభం :- ప్రింటింగ్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి చేయు యత్నాలు సత్ఫలితాలిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అమాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు.
 
మీనం :- ట్రాన్స్ పోర్టు, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి ఆశాజనకం. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయం వల్ల నిరుత్సాహం కానవస్తుంది. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది.