మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-11-2021 ఆదివారం రాశిఫలాలు : ఆదిత్య హృదయం చదివిన లేక ఆలకించినా శుభం

మేషం :- మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
వృషభం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు కృషి ఫలిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. సభలు, సమావేశాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అసవరం. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు.
 
మిధునం :- అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య అవగాహనా లోపం, చికాకులు చోటుచేసుకుంటాయి. రావలసిన ధనం చేతికందటంతోమీలో పలు ఆలోచనలు విధాలుగా ఉంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు వాగ్దానాలు చేయడం మంచిది కాదు.
 
కర్కాటకం :- స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. దైవ కార్యక్రమాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఏ యత్నం కలిసిరాక పోవటంతో నిరుద్యోగులు అసంతృప్తికి లోనవుతారు.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూల చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ముఖ్యమైన పనులు ఆశించిన రీతిలో పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు.
 
కన్య :- వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.
 
తుల :- నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోగతి కానరాగలదు. నిరుద్యోగులకు ఇంటర్వూలలో మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- మిత్రులకు మీ సమర్ధతపై నమ్మకం ఏర్పడుతుంది. ఖర్చులు పెరగడంతో రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. విద్యార్థులకు స్థిరబుద్ధి అవసరమని గమనించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం :- విందులు, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలయిక వనసమారాధనలో సంతోషంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేక పోవచ్చు. గత స్మృతులు జప్తికి వస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళుకువ వహించండి.
 
కుంభం :- పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ధనం బాగా ఖర్చు చేస్తారు. ఊహించని అవకాశాలు వస్తాయి. ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా మీ యత్నాలు సాగించండి. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పని భారం అధికమవుతుంది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయంచేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.