గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-11-2021 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

మేషం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. పరిశోధకులకు, గణిత, సైన్సు ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
వృషభం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
 
మిథునం :- ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
కర్కాటకం : - స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. మీ బంధవులను సహాయం అర్లించే బడులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. గృహ నిర్మాణాలకు కావలసిన ప్లానుకు అమోదం లభిస్తుంది.
 
సింహం :- మీ శక్తిసామర్థ్యాలపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు అనుకూలమైనకాలం. ఇచ్చిపుచ్చుకునే విషయాలు, పెట్టిపోతలలో పెద్దల సలహా పాటించండి. స్వయంకృషితోనే మీరు బాగా రాణిస్తారు. దూరప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా అధికారులను మెప్పించటం కష్టం.
 
కన్య :- వ్యాపార రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించవు. బంధువులను కలుసుకుంటారు. రాజీమార్గంతో ఆస్తి, స్థల వివాదాలు పరిష్కారం కాగలవు, వాహనం నడుపునప్పుడు మెళుకువ అవసరం. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి.
 
తుల :- ఇంట బయటా సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల సహాయ, సహకారాలు లభిస్తాయి. కళత్ర సౌఖ్యం ఉండదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఐరన్, సిమెంట్, కలప, రంగాలలో వారికి చురుకుదనం కానవస్తుంది.
 
వృశ్చికం :- భక్తి, శ్రద్ధలు పెరుగుతాయి. లారీ వ్యాపారులకు చికాకులు తప్పవు. దాన ధర్మాలు చేసిమంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పూర్వపు మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నివాస గృహంలో సమస్యలు తలెత్తుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్తాయి సిబ్బందితో చికాకులు తప్పవు. ఖర్చులు ఊహించినవే కావటంతో పెద్దగా ఇబ్బందులుండవు. ఒక అవకాశం కలిసిరావటంతో మీలో ఉత్సాహం నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
 
మకరం :- ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. స్త్రీలు ఆహార, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తప్పవు.
 
కుంభం :- స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఇబ్బందులెదురవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
మీనం :- మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థునులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పడు. స్పెక్యులేషన్ సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.