శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-11-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించిన ఐశ్వర్యాభివృద్ధి..

మేషం :- ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోని వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో పునరాలోచన చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి.
 
వృషభం :- గృహ నిర్మాణాలు, మరమత్తులు చేపడతారు. విద్యార్థులకు శ్రమాధిక్యత, ఆందోళన తప్పవు. శ్రీవారు, శ్రీమతికి సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
మిథునం :- ఆపదసమయంలో బంధు మిత్రులు అండగా నిలుస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. చేద్దామనుకున్నా పరిస్థితులు అనుకూలించవు.
 
కర్కాటకం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పీచు, నార, ఫోము, లెదర్, లాటరీ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడుట మంచిది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు.
 
సింహం :- చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఆత్మీయుల కలయిక, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
కన్య :- వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కార్యదీక్షతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి.
 
తుల :- ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. స్త్రీలకు ఏ విషయం పట్ల ఆసక్తి ఆసక్తిగా ఉండదు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వాణిజ్య ఒప్పందాలు, సంతకాల విషయంలో ఏకాగ్రత అవసరం. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగానే ఉండటం వల్ల ఇబ్బందులే మాత్రం ఉండవు.
 
వృశ్చికం :- గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో రాణిస్తారు. అవివాహితులకు అన్ని విధాలా శుభదాయకు దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. అధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. 
 
ధనస్సు :- ఉద్యోగస్తులు ఆశించిన పదోన్నతి అవకాశం ఆగిపోయే ఆస్కారం ఉంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. మీ గురించి కొంతమంది చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
మకరం :- చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉండి దేనియందు ఆసక్తి ఉండదు. శుభాకార్యాల్లో బంధు మిత్రులతో పట్టింపు లెదుర్కుంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు ఆత్మనిగ్రహం వహించండి. ప్రియతమల రాక సంతోషం కలిగిస్తుంది.
 
కుంభం :- మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపందాల్చుతాయి. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహ పరుస్తుంది. గృహంలో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
 
మీనం :- లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన మంచిది దైవకార్యాల్లో పాల్గొంటారు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకం. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా పురోభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.