శనివారం, 1 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2025 (07:39 IST)

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

Saumya pradosh
కార్తీక మాసం కోటి సోమవారం మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ కోటి సోమవారం రోజు ఆచరించే పవిత్ర స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్లు అధికంగా ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. ఈ ఏడాది 2025 అక్టోబర్‌ 30వ తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది. 
 
అక్టోబర్‌ 29 సాయంత్రం 05.29 గంటలకు శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. అనంతరం అక్టోబర్‌ 30 సాయంత్రం 06.33 గంటలకు ముగుస్తుంది. అక్టోబర్‌ 30వ తేదీనే కోటి సోమవారం ఆచరించనున్నారు. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు. 
 
ఈ నక్షత్రం ఈసారి సోమవారం రాకపోయిన శ్రవణ నక్షత్రం వచ్చిన గురువారం పూట కోటి సోమవారంగా పరిగణిస్తారు. కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. 
 
కోటి సోమవారం రోజున శివాలయంకు వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. నువ్వులమహావిష్ణువు ఆలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపారాధన చేసి, తులసీ మాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించి.. భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం శుభప్రదం.
 
కోటి సోమవారం రోజున ఉపవాసం చేయడం ద్వారా, ఆత్మ శుద్ధి చెందుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. పురాణాల ప్రకారం, ఈ ఒక్క సోమవారం ఉపవాసం ఉన్నా... కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత సమానంగా భావిస్తారు. ఈ రోజున ఉసిరి చెట్టు కింద పూజ చేసి, కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక వనభోజనం చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం ద్వారా ఐశ్వర్యం, సుఖసంతోషాలు, సంతానాభివృద్ధి కలుగుతాయి.