కోటి సోమవారం అంటే ఏమిటి?  
                                       
                  
                  				  స్కంద పురాణం ప్రకారం, కార్తీక మాసంలో ఒక ప్రత్యేకమైన తిథి, నక్షత్రం కలిసిన రోజును కోటి సోమవారం లేదా కోటి సమవారం అంటారు. కార్తీక మాసంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం ఏ రోజున కలిసి వస్తాయో, ఆ రోజే కోటి సోమవారంగా పరిగణించబడుతుంది. ఈ తిథి-నక్షత్రాల కలయిక రోజున చేసే ఉపవాసం, దీపారాధన, నదీ స్నానం లేదా దానం వంటి శుభకార్యాలు కోటి సోమవారాలు చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.
				  											
																													
									  
	 
	అందుకే దీనికి కోటి సమవారము... కోటి రెట్లు సమానమైన ఫలాన్ని ఇచ్చే రోజు అనే పేరు వచ్చింది, కాలక్రమేణా ఇది వ్యవహారంలో కోటి సోమవారంగా స్థిరపడింది. అరుదుగా, ఈ సప్తమి-శ్రవణ నక్షత్ర కలయిక స్వయంగా సోమవారం రోజున వస్తే, ఆ రోజు అత్యంత అద్భుతమైన, విశేషమైన రోజుగా భావించబడుతుంది. ఎందుకంటే, ఆ రోజున కార్తీక సోమవారం, కోటి సమవారాల పుణ్యఫలం రెండూ లభిస్తాయి.