సంబంధిత వార్తలు
- కార్తీక మాసంలో నారికేళ దీపాన్ని గుడిలో ఎలా వెలిగించాలి?
- పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?
- Karthika Masam 2025 : కార్తీకమాసం సోమవారాలు, ఉసిరి దీపం తప్పనిసరి.. శివకేశవులను పూజిస్తే?
- karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?
- Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?
కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?
కార్తీక మాసము గొప్పతనం, దానిని ఆచరించడం వలన కలిగే విశిష్ట ఫలితాల గురించి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించినట్లు పద్మ పురాణంలో ప్రస్తావించబడింది. ముఖ్యంగా, శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామకు కార్తీక మాసం యొక్క మహత్యాన్ని ఉపదేశించినట్లు పురాణ గాథ ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రధాన అంశాలు ఏమిటో తెలుసుకుందాము.
మాసాలలో కార్తీక మాసమునకు సమానమైన మాసము లేదు. నా కంటే గొప్ప దేవుడు లేడు. వేదములకు సమానమైన శాస్త్రములు, గంగకంటే పుణ్యప్రదమైన తీర్థములు లేవు అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు... స్నానం, దీపం, పూజ, దానం అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయి. ఇతర మాసాలలో చేసిన పుణ్యకార్యాల కంటే ఈ మాసంలో చేసే వాటికి అనేక రెట్లు ఎక్కువ ఫలం ఉంటుంది.
కార్తీక మాసంలో దీపారాధన చేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే, ఈ దీపాలు తమ జీవితంలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. శివాలయాల్లో, విష్ణాలయాల్లో, తులసికోట వద్ద దీపాలు వెలిగించడం శుభకరం. శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో దామోదరుడు అనే రూపంలో ఉంటాడు. ఈ నెలలో ఆయనను పూజించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి.
తర్వాతి కథనం
