1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. nagaraju arrested under pocso act for assaulting minor in tirupati

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

tirupati
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణంలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. ఈ ఘటన తిరుపతి రూరల్ పరిధిలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన దంపతులు రోజువారీ కూలీ పనుల చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారు పనులకు వెళ్ళిన సమయంలో ఏడేళ్ల బాలిక ఇంటి సమీపంలోనే ఆడుకునేది. ఆ బాలికపై కన్నేసిన నిందితుడు నాగరాజు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి ఆ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ వెంటనే స్పందించిన పోలీసులు.. నిందితుడుని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే, బాలికను ఆస్పత్రికి తరలించి శారీరక, మానసిక వైద్య పరీక్షలు చేయించారు. ఈ కేసులో న్యాయపరమైన దర్యాప్తు జరుగుతోందని, నిందితుడికి చట్ట ప్రకారం శిక్షి తప్పదని పోలీసులు వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు