శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-11-2021 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన...

మేషం :- మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలుగకుండా వ్యవహరించండి. దూరప్రయాణాలు అనుకూలం.
 
వృషభం :- రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నష్టాల బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఊహించనవే కావటంతో పెద్దగా ఇబ్బందులుండవు.
 
మిధునం :- బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రిప్రజెంట్లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో చికాకులు, పనిభారం, అధికారుల నుంచి ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సిమెంటు, ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి వారి రంగాలలో చురుకుదనం కానవస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఇతరులజోక్యం వలన వాయిదాపడతాయి. శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు.
 
సింహం :- పొగాకు, ప్రత్తి రంగాలలో వారికి కలిసి వచ్చేకాలం. దైవదీక్షలు స్వీకరిస్తారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి ఒక శుభకార్యం నిశ్చయంకావటంతో కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి.
 
కన్య :- మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. విదేశీవస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. లౌకికంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
తుల :- స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికం. మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహరాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి. బంధువుల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
ధనస్సు :- వృతిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలో విజయాన్ని సాధిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు ప్రతి విషయంలోను తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది.
 
మకరం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించుకోవటం శ్రేయస్కరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
కుంభం :- ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. దైవకార్యాలపట్ల ఆసక్తి నెలకొంటుంది. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడతారు. మీ కష్టం ఫలించటంతో అనిర్వచనీయమైన ఆనందం పొందుతారు. 
 
మీనం :- మీ అవసరాలు, బలహీనతలను ఇతరులు స్వార్థానికి వాడుకుంటారు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. మీ జీవిత భాగస్వామి ప్రోద్వలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి.