మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (08:17 IST)

15-11-2021 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా మీ సంకల్పం..

మేషం :- చేనేత, నూలు, ఖాదీ, కలంకారీ వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అభిరుచులకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. ఎదుటి వారి నుండి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.
 
వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. విద్యార్థులకు తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారంలో ముఖ్యుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. ఫోం, పీచు, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
మిధునం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు కలిసివస్తుంది. బంధువులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేయునపుడు పునరాలోచన మంచిది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాతావరణంలో మార్పు మీ కెంతో చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం :- ముఖ్యుల నుండి ధన సహాయం లభించడంతో ఒకడుగు ముందుకు వేస్తారు. క్రీడ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు అలంకార వస్తువుల కొనుగోలు చేస్తారు. నిత్యవసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు శుభదాయకం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
సింహం :- హోటలు, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలలో ఆటంకాలు తప్పవు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు అశాజనకం,
 
కన్య :- అవసరపు సలహా ఇచ్చి సమస్యలకు గురికాకండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పవు. సహకార సంస్థల్లో వారికి, ప్రైవేటు, మార్కెటింగ్ రంగాల్లో శ్రమాధిక్యత కానవస్తుంది. ఖర్చులు అదుపులోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.
 
తుల :- గణిత, సైన్సు రంగాల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. కాంట్రాక్టర్లు తొందరపడి సంభాషించడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కళలు, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం.
 
వృశ్చికం :- ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి చికాకులను ఎదుర్కొంటారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు. వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. స్త్రీలు చుట్టుపక్కల వారి నుండి గౌరవం, ఆదరణ పొందుతారు.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడక తప్పదు. కంది, మిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రియతముల కోసం నూతన పథకాలు వేస్తారు.
 
మకరం :- దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య ఒక కొలిక్కివస్తుంది. విద్యార్థులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కుంభం :- రచయితలకు, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్త్రీలకు అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
 
మీనం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలించక పోవటంతో ఆందోళనకు గురిఅవుతారు. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించడం మంచిది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. రావలసిన మొత్తం కొంత ముందు వెనుకలుగానైనా అందుకుంటారు.