గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-11-2021 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన...

మేషం :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థుల్లో ధ్యేయం పట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. వ్యాపారాల్లో నూతన భాగస్వామికులను చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు బంధువుల రాక అసహనం కలిగిస్తుంది.
 
వృషభం :- ఆస్తి పంపకాల వ్యవహారంలో సోదరీ, సోదరులతో ఏకీభవిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. సమయానుకూలంగా వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. గృహ నిర్మాణాల్లో అధికారుల నుంచి అభ్యంతరా లెదుర్కుంటారు. నిలిపివేసిన పనులు పును ప్రారంభిస్తారు.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. భేషజాలు, ప్రలోభాలకు పోకుండా విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంటుంది.
 
కర్కాటకం :- మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. వదిలేసుకున్న బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
సింహం :- వ్యవసాయ, తోటల రంగాల వారికి ఫలసాయం ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.
 
కన్య :- ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభించగలదు. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. సిమెంటు, కలప, ఇటుక, వ్యాపారులకు ఆశాజనకంగా ఉండగలదు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి.
 
తుల :- ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత, స్థిరబుద్ది నెలకొంటాయి. విలువై వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
వృశ్చికం :- రాజకీయాలు, కళ, సాంస్కృతిక, ప్రకటనల రంగాలవారు లక్ష్యాలు సాధించడం కష్టం. ముఖ్యుల పట్ల ఆహంకారం వ్యక్తం చేయటం వల్ల అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. బ్యాంకింగ్ రంగాలవారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కొంటారు. సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటంతో ఒకింత ఒడిదుడుకులు తప్పవు.
 
ధనస్సు :- ప్రభుత్వాని చెల్లించాల్సిన టాక్సులు, ఇతరత్రా చెల్లింపులు జరుపుతారు. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
మకరం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. శతృవులపై విజయం సాధిస్తారు. పసుపు, శెనగ, నూనె, మిర్చి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి.
 
కుంభం :- వస్త్ర వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయాలలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ధోరణి నిరుత్సాహపరుస్తుంది. బంధు మిత్రుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
మీనం :- ఇతరుల ఆనందం, తెలివి మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చికాకులను ఎదుర్కొంటారు. ఋణప్రయత్నం వాయిదా పడుతుంది. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. చేపట్టినపనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరపాటు కూడదు.