గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-11-2021 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం

మేషం :- వాతావరణంలో మార్పు తోటల రంగాల వారికి ఆందోళన కలిగిస్తుంది. సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. మీ కళత్ర మొండితనం చికాకు కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు అధికమవుతుంది. వైద్యులకు మెళుకువ, ఏకాగ్రత అవసరం.
 
వృషభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. పాఠ రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. వాహనచోదకులకు చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
మిథునం :- మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయటం మంచిది. ఏజెంట్లకు, బ్రోకర్లకు అనుకూలం. ప్రముఖుల కలయిక వాయిదాపడటంతో నిరుత్సాహనికి గురవుతారు.
 
కర్కాటకం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థినుల మొండితనం అనర్థాలకు దారితీస్తుంది. సోదరీ సోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడతారు.
 
సింహం :- ఆర్థిక సమస్యల వల్ల ఒకింత ఆందోళనకు గురవుతారు. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయలు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. కలప, సిమెంటు, బరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమఫలితం.
 
కన్య :- రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారు అక్షరదోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు పైఅధికారులతో సంభాషిచేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ సంతానం కోసం ధనం వ్యయం చేస్తారు.
 
తుల :- కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకుంటారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విదేశీ ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఫైనాన్సు, చిటఫండ్ వ్యాపారస్తులకు సంతృప్తి కానరాగలడు.
 
వృశ్చికం :- కంప్యూటర్, టెక్నికల్, ఐ.టి. రంగాల్లో వారికి సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక సమావేశాలు అర్థాంతంగా ముగుస్తాయి. మీ ఆశయ సిద్ధికి నిరంతర కృషి పట్టుదల ముఖ్యమని గమనించండి.
 
ధనస్సు :- మీ విజయానికి మీ స్నేహితుల సహకారం లభించగలదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో లౌక్యం అవసరం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి అధిక శ్రమ, పనిభారం అధికం కాగలదు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. 
 
మకరం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి పరోభివృద్ధి కొబ్బరి, పండ్ల పానీయ, కేటరింగ్ హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలడు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళుకువ వహించండి. 
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల మక్కువ పెరుగుతుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగి సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెలకువ వహించండి. ఒక వ్యవహారంలో బంధుమిత్రులు మీ తీరును తప్పుపడతారు.
 
మీనం :- షాపింగ్ కోసం ధనం వెచ్చిస్తారు. సాంఘిక, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుభవం లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి పనిభారం అధికమవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.