గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-11-2021 మంగళవారం దినఫలాలు - లక్ష్మీదేవిని దర్శించడంవల్ల ఆర్థికాభివృద్ధి..

మేషం : నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది.
 
వృషభం :- అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్టాక్ నిల్వలో మెళుకువ అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ధనవ్యయంలో మితంగా వ్యవహరించండి. నూనె, మిర్చి, కంది వ్యాపారకస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
మిథునం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకర సమయం. చాకచక్యంతో లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
కర్కాటకం :- వస్త్ర, గృహోపరకణాలు, బంగారు, వాహనాల వ్యాపారులకు లాభదాయకం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు.
 
సింహం : - ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. బంధువులను కలుసుకుంటారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు.
 
కన్య :- ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. రుణ విముక్తులు కావడంతోపాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులు లబ్ధి పొందుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
తుల :- బ్యాంకింగ్ రంగాలవారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సన్నిహితుల ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అసాధ్యమనుకున్న వ్యవహారం సునాయాసంగా సానుకూలమవుతుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
వృశ్చికం :- స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సహకార సంస్థలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
ధనస్సు :- అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. నిశ్చింతగా ఉండండి మీ సమస్యలు ఇబ్బందులు అవే సర్దుకుంటారు. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మకరం :- వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి పురోభివృద్ధి. పాత సమస్యల నుండి బయటపడతారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కుంభం :- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఖర్చులు రాబడికి మించటంతో చేబదుళ్ళు స్వీకరిస్తారు. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులెదుర్కుంటారు. మీ కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
మీనం :- పారితోషికాలు అందుకుంటారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. దంపతుల మధ్య దాపరికు మంచిది కాదని గమనించండి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు.