సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-11-2021 సోమవారం దినఫలాలు - నాగేంద్రస్వామిని పాలతో అభిషేకించిన...

మేషం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
వృషభం :- ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. అడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.
 
మిథునం :- దంపతుల మధ్య అవగాహన లోపం, చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. స్థిరాస్తి, క్రయవిక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు.
 
కర్కాటకం :- ప్రైవేటు, వృత్తి వ్యాపారాలలో వారికి అన్ని విధాలా కలిసిరాగలడు. పరిశ్రమలు, సంస్థలకు కావలసిన లైసెన్సులు, పర్మిట్లు మంజూరు కాగలవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయ, కళాసాంస్కృతిక, బోధన రంగాల వారికి శుభప్రదం. నిరుద్యోగులకు సతాకాలం ప్రారంభమవుతుంది.
 
సింహం :- వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పని ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పెద్ద మొత్తంలో రుణం చేస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
 
కన్య :- రవాణా, ఎగుమతి రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. స్త్రీలు తెలియని అశాంతికి గురవుతారు. భాగస్వామ్యుల మధ్య విభేదాలు సృష్టించేవారు అధికం అవుతున్నారని గమనించండి. ఉపాధ్యాయులకు విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ప్రైవేటు, వృత్తి వ్యాపారాలలో వారికి అన్ని విధాలా కలిసిరాగలడు.
 
తుల :- ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. విదేశీయాన యత్నాలలో పురోభివృద్ధి పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారిలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. 
 
వృశ్చికం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. రావలసిన ఆదాయం అందటంతో ఆర్థికంగా ఒకడుగు ముందుకేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ప్రముఖులను కలుసుకుంటారు
 
ధనస్సు :- స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సోదరీ సోదరులతో ఏకీభవించ లేకపోతారు.
 
మకరం :- ఆర్థిక సంతృప్తి కానరాదు. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కంప్యూటర్, ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి చికాకులు, పనిభారం అధికం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు.
 
కుంభం :- రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. గొప్పగొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. సన్నిహితుల మధ్య దాపరికాలు సరికాదని గ్రహించాలి. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
మీనం :- విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. దంపతుల మధ్య చికాకులు తలెత్తగలవు. ధనం అధికంగా వ్యయం చేస్తారు. ద్విచక్ర వాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు.