సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (18:47 IST)

12-11-2021 శుక్రవారం దినఫలాలు - పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు..

12-11-2021 - శుక్రవారం. శ్రీ ప్లవనామ సం|| కార్తీక శు|| అష్టమి ఉ.10.30 ధనిష్ఠ రా.7.51 రా.వ.2 57 0 4.32
ఉదు.8.20ల 9.05, పుదు.1207 ల 12.52. పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు నెరవేరుతాయి. 
 
మేషం: - ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రతి విషయంలోను మొండిధైర్యంతో నిశ్చింతగా వ్యవహరిస్తారు. ప్రత్యర్థుల గురించి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో నిరుత్సాహం తప్పదు.
 
వృషభం: - ఓర్పు, లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. కొత్త వ్యాపారాలపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. 
 
మిధునం:- మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ప్రేమికులకు విషయంలోను ఆలోచన, అవగాహన ముఖ్యం. వ్యాపారా భివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. పోగొట్టుకున్న వస్తువులు అతికష్టంమ్మీద రాబట్టుకుంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
కర్కాటకం: - ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. రాజకీయనాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ సంతానం కోసం కొత్త పథరాలు రూపొందిస్తారు, వాగ్విదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మిత్రుల ఆంతర్యం గ్రహిస్తారు.
 
సింహం:- వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది.
 
కన్య: - మీ జీవితభాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. అపరిచిత వ్యక్తులతో మితంగా వ్యవహరించండి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
తుల:- మీ శ్రీమతితో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
వృశ్చికం: - ఆలయాలను సందర్శిస్తారు. కీలకమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయం మీ శ్రీమతికి నచ్చదు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు రావలసిన మెడికల్ క్లయింలు, ఇతర అలవెన్సులు మంజూరవుతాయి. స్త్రీల ఆలోచనలు నిలకడగా ఉండవు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి.
 
ధనస్సు: - సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటంతో పనులు వేగం పుంజుకుంటాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో స్వల్ప చికాకులు ఎదుర్కుంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి.మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
మకరం: - ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. విద్యార్థులు చదువులకోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. విందులు, వినోదాల్లో ఆచితూచి వ్యవహరించండి. పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కుంభం:- స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందు లెదుర్కుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో విభేదాలు తలెత్తుతాయి.
 
మీనం:- స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు.