బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-11-2021 - మంగళవారం మీ రాశి ఫలితాలు.. సలహా ఇచ్చేవారే కాని సాయపడే వారుండరు

23-11-2021 - మంగళవారం.. శ్రీ ప్లవనామ సం|| కార్తీక ఇ|| చవితి రా.9.01 ఆరుద్ర ఉ. 11. 19 రా.వ.12 23 0 2.07. ఉ.దు.8.18ల 9.04, రా.వ.10.28ల 11.18
 
కార్తికేయుడిని పూజించినా శుభం చేకూరుతుంది.
 
మేషం:- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణం పూర్తిగా చెల్లించి తాకట్టులు విడిపించుకుంటారు. స్త్రీల అతిథి మర్యాదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. అయిన వారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
వృషభం:- పెద్దమొత్తంలో చెక్కుల జారీలో వ్యాపార వర్గాలకు పునరాలోచన అవసరం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని భావించండి.
 
మిథునం: - వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. విదేశీయానం, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. స్త్రీలకు పొరుగు వారి నుంచి ఆహ్వానం అందుతుంది. మీ ఇబ్బందులను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.
 
కర్కాటకం:- ప్రైవేట్ ఫైనాన్సుల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వటం వాయిదా వేయడం మంచిదికాదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటారు. స్త్రీలకు శుభకార్యాలు, వేడుకల్లో బంధు మిత్రుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం:- బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లాలనే ఆలోచన బలపడుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఇతరులు చేసిన తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు ఆశాజనకం. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం పొందుతారు.
 
కన్య: - సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. వాదోపవాదాలకు భేషజాలకు దూరంగా ఉండండి.
 
తుల: - ఆర్ధిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. రిప్రజెంటివులకు, ప్రైవేటు సంస్థలలో వారికి ఊహించని చికాకులు తలెత్తుతాయి. దైవదీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. నిత్యావసర వస్తువులకు, స్టాకిస్టులకు గుప్త విరోధులు అధికం అవుతున్నారని గమనించండి. నూతన పెట్టుబడులకు సదవకాశాలులభిస్తాయి.
 
వృశ్చికం:- నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. ఆప్తుల కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. స్పెక్యులేషన్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. నిరుద్యోగులు చిన్న సదవకాశము లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
ధనస్సు: - సాహసకృత్యాలు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు పూర్తి కాక నిరుత్సాహం చెందుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు. ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ సంతానం ఉద్యోగం, వివాహ విషయాలపై శ్రద్ధ వహిస్తారు.
 
మకరం:- ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటాయి. సలహా ఇచ్చేవారే కాని సాయపడే వారుండరు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. పెద్దమొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో వ్యాపారులు తగు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం:- ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోకపోవటం క్షేమ దాయకం. ధనమూలక సమస్యలకు చక్కని పరిష్కారం గోచరిస్తుంది. ఊహించని పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పారిశ్రామిక వేత్తలు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆక్షేపణలు, అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది.
 
మీనం:- ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనప్రలోభం వల్ల ఉన్నతాధికారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.