గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (12:31 IST)

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీకి టైమ్ వచ్చేసింది..

Ola
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీకి రంగం సిద్ధమైంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు డిసెంబర్ 15, 2021 నుండి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్టులో విడుదల చేసినప్పటి నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ స్కూటర్‌కు రికార్డు ప్రీ-బుకింగ్ జరిగింది. 
 
కేవలం రూ.499 చెల్లించి ఆన్‌లైన్‌లో ఈ స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు. మీరు ఈ స్కూటర్‌ని కేవలం రూ. 2,999 EMIతో కొనుగోలు చేయవచ్చు.

ఆన్‌లైన్ బుకింగ్ కోసం, మీరు ఓలా ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్ www.olaelectric.comని సందర్శించాలి. ఓలా ఎలక్ట్రిక్ ఓలా ఎస్1 ప్రో , ఓలా ఎస్1 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.