ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 నవంబరు 2021 (17:43 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మహిళలే భాగస్వాములుగా ఉండే డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించిన అమెజాన్

మహిళలకు అర్ధవంతమైన పని అవకాశాలను అందించాలనే తన నిబద్ధతకు కట్టుబడి, అమెజాన్ ఇండియా నేడు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మహిళలే భాగస్వాములుగా ఉన్న డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించామని ప్రకటించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఏ ఏర్పాటు చేసిన ఈ కొత్త స్టేషన్‌ను అమెజాన్ డెలివరీ సర్వీస్ పార్టనర్ నిర్వహిస్తుంది. ఈ స్టేషన్ తమిళనాడు, గుజరాత్ మరియు కేరళ రాష్ట్రాల్లో అమెజాన్‌కు ఉన్న డిఎస్‌పిలు ఇప్పటికే నిర్వహిస్తున్న పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న నాలుగు డెలివరీ స్టేషన్‌లకు అదనంగా వచ్చి చేరింది. వైవిధ్యం, ఈక్విటీ మరియు ఇన్‌క్లూజివిటీ నిబద్ధతను బలోపేతం చేస్తూ, లాజిస్టిక్స్ రంగంలో మహిళలకు అవకాశాలను వృద్ధి చేసేందుకు అమెజాన్ ఇండియా చేస్తున్న ప్రయత్నాలను ఈ ఆల్-ఉమెన్ డెలివరీ స్టేషన్ మద్ధతు ఇస్తోంది.
 
అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ ఆపరేషన్స్ డైరెక్టర్ కరుణా శంకర్ పాండే మాట్లాడుతూ, “దేశంలో ఐదవ ఆల్ -ఉమెన్ డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించడం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిది అని ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నిరంతర విస్తరణలతో మహిళలకు వారి పరిధులను విస్తరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ, వృద్ధి అవకాశాలను అందించాలని కోరుకుంటున్నాము.
 
దేశవ్యాప్తంగా ఉన్న మా డెలివరీ సర్వీస్ భాగస్వాములు అమెజాన్ ఇండియా కార్యకలాపాల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో, మా వినియోగదారులకు చిరునవ్వులను అందించడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. మేము మహిళలకు సురక్షితమైన మరియు సంతృప్తికరమైన అవకాశాలను అందించడానికి కట్టుబడి ఉంటాము మరియు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూత ఇవ్వాలన్న మా సంకల్పానికి అనుగుణంగా స్థిరంగా ఉంటాము’’ అని పేర్కొన్నారు.
 
డిఎస్‌పి ప్రోగ్రామ్ అనేది లాస్ట్-మైల్ డెలివరీ మోడల్ కాగా, అమెజాన్ వినియోగదారులకు ప్యాకేజీలను వితరణ చేసేందుకు అమెజాన్ ఇండియా ఎక్కువగా చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలతో భాగస్వామిగా ఉంది. చాలా మంది భాగస్వాములకు, ఈ కార్యక్రమం వారి మొదటి వ్యవస్థాపక వెంచర్. వినియోగదారులకు డెలివరీ వాగ్దానాలను సజావుగా నెరవేర్చేందుకు వారు కమ్యూనిటీకి సంబంధించిన తమ స్థానిక పరిజ్ఞానాన్ని మరియు అమెజాన్ ఇండియా అందించే టెక్నలాజికల్ మద్దతును వినియోగించుకుంటారు.
 
ఈ కార్యక్రమం అమెజాన్ ఇండియా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు విస్తరించేందుకు సహాయపడటమే కాకుండా ఎస్‌ఎంబిలకు వృద్ధి మార్గాలను అందిస్తోంది. నేడు, అమెజాన్ ఇండియా పదివేల మంది డెలివరీ అసోసియేట్‌లకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ 750 కన్నా ఎక్కువ నగరాల్లో 1,650 డెలివరీ సర్వీస్ పార్టనర్ స్టేషన్‌లను కలిగి ఉంది. అలాగే, దేశవ్యాప్తంగా లాస్ట్-మైల్ డెలివరీలను సజావుగా నిర్వహించేందుకు కంపెనీకి అవకాశం కల్పిస్తోంది.
 
“నేను ఎప్పుడూ ప్రతిష్టాత్మకంగా ఉండేవాడిని మరియు ఉన్నత విద్యను పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుమతించలేదు. రైతుగా ఉన్న నాన్నకు ఇంటి ఖర్చులకు ఆర్థిక సహాయం కావాలి. ఈ ఉద్యోగంతో నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు మరియు నా కుటుంబాన్ని కూడా చూసుకోవడానికి సాధికారతను పొందాను. మా గ్రామంలోని అనేక మంది యువతులకు స్ఫూర్తినివ్వడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది’’ అని పిడుగురాళ్లలోని మహిళా డెలివరీ స్టేషన్‌కు చెందిన డెలివరీ అసోసియేట్ విమల బాణాల అన్నారు.
 
అమెజాన్ ఇండియా అన్ని వర్గాల ప్రజలకు అర్థవంతమైన అవకాశాలను అందించడం ద్వారా విభిన్నమైన, సమానమైన మరియు సమగ్రమైన శ్రామికశక్తిని నిర్మించేందుకు కట్టుబడి ఉంది. పండుగ సీజన్‌కు ముందు, కంపెనీ తమిళనాడులోని చెన్నైలో ఒక క్రమబద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించగా, ఇది పూర్తిగా మహిళలు, సైనికులుగా పని చేసిన అనుభవం ఉన్నవారు, ట్రాన్స్‌జెండర్లు, ఇతర వ్యక్తులతో సహా సమాజంలో తక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్న వారిచే తక్కువ ప్రాతినిధ్యం లేని వారితో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం మహిళల నిర్వహణలో ఉన్న డెలివరీ స్టేషన్‌తో పాటు తమిళనాడు, గుజరాత్ మరియు కేరళలోని క్రమబద్ధీకరణ కేంద్రాలతో కలిసి, కంపెనీ సమగ్రమైన మరియు విభిన్నమైన శ్రామికశక్తిని సృష్టించడమే కాకుండా వారు అభివృద్ధి చెందేందుకు బలమైన వ్యవస్థను అందించడంపై దృష్టి సారించింది.