బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: గురువారం, 18 నవంబరు 2021 (14:47 IST)

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా, మావోయిస్టులతో సంబంధాలు, ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఎన్.ఐ.ఏ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో గురువారం తెల్లవారుజాము నుంచి విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అలాగే, విశాఖపట్టణంలోని అరిలోవ కాలనీని న్యాయవాద దంపతులు శ్రీనివాస రావు, అన్నపూర్ణ ఇళ్ళలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో ఉన్న రవిశ్రమ, అనూరాధ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు, ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.