శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (12:25 IST)

వనపర్తి జిల్లాలో మొసలి కలకలం..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పాములు జన సంచారంలోకి వస్తున్నాయి. వనపర్తి జిల్లా ఫుల్గర్ చర్ల గ్రామంలోకి వచ్చిన ఓ మొసలి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి రెండు గంటల సయయంలో ఊరి చివర ఉండే పొలాల నుంచి గ్రామంలోకి మొసలి ప్రవేశించింది. 
 
దీంతో గ్రామస్థులు భయాందోళను గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తెల్లవారుజామున వచ్చి గ్రామస్తుల సహాయంతో మొసలిని బంధించారు. అనంతరం మొసలి ని తీసుకెళ్లి బీచూపల్లి వద్ద కృష్ణానదిలో వదిలిపెట్టారు.