ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (16:17 IST)

బాబు కోసం బీఏసీ సమావేశం ఆలస్యం చేశాం.. ఏపీ సీఎం జగన్

బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తారని భావించామని, ఇందుకోసం సమావేశాన్ని సైతం ఆలస్యంగా ప్రారంభించామని కానీ ఆయన రాలేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ అసెంబ్లీ గురువారం సమావేశమైంది. 
 
ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రభావం చంద్రబాబుపై బాగా పడిందన్నారు. అందుకే బీఏసీ సమావేశానికి చంద్రబాబు హాజరుకాలేదని చెప్పారు. అయితే, చంద్రబాబుకు ఎలాంటి కష్టం వచ్చిందో నాకు తెలియదని, కానీ, కుప్పం ఎఫెక్టు మాత్రం బాగా పడిందని మావాళ్ళు అంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 
 
కాగా, ఈ సమావేశాల్లో సీఎం జగన్ మహిళా సాధికారికతపై ప్రసంగించారు. రాష్ట్రంలో మహళలు సర్వతోముఖాభివృద్ధిని ఓ ఉద్యమంలా భావించి అనేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. గడిచిపోయిన రెండున్నరేళ్ళ కాలం మహిళా సాధికారికత అంశం ఓ సువర్ణ అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు.