మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (20:12 IST)

ఏపీ రోడ్లు మరమ్మత్తులు: విమర్శలకు తావివ్వకండి.. సీఎం ఆదేశం

రాష్ట్రంలోని రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులపై ఉన్న గుంతలు తక్షణమే పూడ్చేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ముందు పాట్‌ హోల్‌ ఫ్రీ స్టేట్‌గా రహదారులు ఉండాలని… తర్వాత కార్పెటింగ్‌ పనులు పూర్తిచేయాలని చెప్పారు.
 
ఈ సమీక్షలో సీఎం…. విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి రావాలని అన్నారు. ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌లలో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. 
 
2022 జూన్‌ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణ పూర్తికావాలని అన్నారు. రాష్ట్రం మొత్తం రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేపట్టి…రాష్ట్రంలో ఏ రోడ్లు కూడా గుంతలు లేకుండా ఉండేలా చేయాలని జగన్ చెప్పారు.