శుక్రవారం, 15 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 ఆగస్టు 2025 (17:01 IST)

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

shilpa shetty
ముంబైకు చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారన్న అభియోగాలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ముంబై మహానగర పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్టుబడి ఒప్పందానికి సంబంధించి రూ.60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై దీపక్ కొఠారి అనే వ్యక్తి జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దంపతులపై కేసు నమోదు చేశారు. అనంతరం దీనిని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
 
గత 2015- 2023 వరకు ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం రూ.60.48 కోట్లు ఇచ్చానని, కానీ ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకున్నారని దీపక్ కొఠారి ఆరోపించారు. షాపింగ్ ప్లాట్‌ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి వారు డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నారు. 2016 ఏప్రిల్ నెలలో తనకు శిల్పా శెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ తెలిపారు. 
 
ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు. ఈ కేసుపై శిల్పా శెట్టి లాయర్ స్పందించారు. మీడియాలో వస్తోన్న ఆరోపణలను ఖండించారు. ఈ కేసుపై గతేడాదిలోనే తీర్పు వెలువడిందని చెప్పారు. ఇందులో శిల్పాశెట్టి దంపతులకు ఎటువంటి ప్రమేయం లేదన్నారు.