బుధవారం, 13 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 13 ఆగస్టు 2025 (19:48 IST)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

Balakrishna, Allu Aravind at Maldheevs
Balakrishna, Allu Aravind at Maldheevs
అల్లు అరవింద్, నందమూరి బాలక్రిష్ణ కలిసిన వేదిక మాల్దీవ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా కుటుంబవేడుకలో భాగంగా బాలయ్యను పలువురు స్టేజీ మీదకు దండలతో ఆహ్వానించారు. అక్కడే వున్న కొందరు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 లోని జాతర పాటను ప్లే చేశారు. ఈ సందర్భంగా అందరూ కోరిక మీరకు బాలయ్య తన ఎనర్జీ చూపించి ఆకట్టుకున్నాడు. ఆ పక్కనే వున్న అల్లు అరవింద్ మరింత ఆనందపడిపోతూ తనూ డాన్స్ లో కలిశారు. ఆఖరికి బాలయ్య మార్క్ తొడ కొట్టడంతో డాన్స్ ముగిసింది.
 
మాల్దీవులలో జరిగిన కుటుంబ సంగీత కార్యక్రమంలో బాలయ్య బాబు పుష్ప 2 “జాతర” పాటకు నృత్యం చేయడం అక్కడి వారిని హుషారు తెప్పించింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. మాల్దీవుల్లో ఓ ఫ్యామిలీ సంగీత్‌లో భాగంగా జరిగిన ఈ వేడుకలో బాలయ్య పుష్ప 2 జాతర సాంగ్‌కు చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. పుష్ప పాటకు సింహం డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.