మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 4 ఆగస్టు 2025 (06:48 IST)

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

Allu Aravind, Shilpa Dhawan, Ashwin Kumar
Allu Aravind, Shilpa Dhawan, Ashwin Kumar
ఈమధ్య అన్నీ సినిమాల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) తో పలు ప్రయోగాలు చేస్తున్నారు. ఏఐ వాడకం పెరిగిపోతోంది. ఆ రంగం ఈ రంగం అని కాకుండా దాదాపు అన్నింటిలో ఏఐ వాడేస్తున్నారు. ఏఐ వాడకంతో గణనీయంగా మార్పులు జరుగుతున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఏఐ వాడకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మనసు ఆవిష్కరించారు.
 
టెక్నాలజీ ఎంత పెరిగినా హీరోల బదులు ఎ.ఐ. టెక్నాలజీ ఎంతబాగా చూపించినా ఫైనల్ అవుట్ పుట్ మాత్రం దర్శకుడి క్రియేషన్ చేయాల్సిందే. ఆయన లేనిదే ఎంత మాత్రం సాధ్యపడదు. ఒకరకంగా ఎ.ఐ. వాడకం వల్ల కథలోని ఆత్మను కోల్పోతాం. దానిని అందరూ గ్రహించాలని అల్లు అరవింద్ పిలుపునిచ్చారు.
 
ఇదే విషయాన్ని నిన్ననే తమిళనటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏఐ వినియోగానికి తాను అభ్యంతరం తెలిపినప్పటికీ సంబంధిత పార్టీలు ఈ విషయంలో ముందుకెళ్లాయంటూ ధనుష్ తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)తో రూపొందించిన క్లైమాక్స్‌తో ‘రాంఝనా’ సినిమాను రీ రిలీజ్‌ చేశారు. ఇది ఆ సినిమా ఆత్మనే కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారాయన.
 
తెలుగులో కూడా పలు సినిమాలు ఎ.ఐ. టెక్నాలజీతో తీశారు. తీస్తున్నారు. ఆమధ్య రవితేజను యంగ్ లో వుండేలా చేసిన సినిమాలో లెపాలు కనిపించాయి. అదేవిధంగా హరిహరవీరమల్లుతోకూడా పవన్ కళ్యాణ్ గుర్రంపై ఎగిరి తుపాకీతో చేసిన యాక్షన్ సీన్ లో ఆయన ఆర్టిఫిషియల్ గా కనిపించారు. ఇక యూట్యూబ్ లలో వస్తున్న ఎ.ఐ. టెక్నాలజీ సరదాగా చూడానికి బాగుంటుంది. కానీ వెండితెరపై ఆవిష్కరించడం అన్ని వేలలా సరైంది కాదని పలువురు నిర్మాతలు అంగీకరిస్తున్నారు.
 
కానీ, ఎ.ఐ. టెక్నాలజీ కొన్ని చిత్రాలకే ఉపయోగకరం. ముఖ్యంగా మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమాలో హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు కథతో రూపొందించారు. వాటిని టెక్నాలజీ ఊహకందని విధంగా తీశారు. అందులో నరసింహ అవతారం కానీ పోరాట సన్నివేశాలు కానీ ఊహకు అందనంత ఎత్తులో మార్చుకుని థ్రిల్ గురిచేయవచ్చు. కానీ అదే సినిమాను నటీనటులతో చేయాలంటే అంత ఎమోషన్ పండదు అంటూ ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ కుమార్ తెలియజేశారు.
 
హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.