మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2025 (16:39 IST)

నీహారికకు రక్షా బంధన్ కట్టి ఆనందాన్ని పంచుకున్న రామ్ చరణ్, వరుణ్ తేజ్‌

Ram Charan, Varun Tej, Neharika
Ram Charan, Varun Tej, Neharika
నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరీమణులకు రాఖీ కట్టి కుటుంబంతో కాసేపు గడిపారు. అందులో భాగంగా మెగా రక్షా బంధన్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లకు రాఖీలు కట్టిన ఫోటోలని అన్ లైన్ లో షేర్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు      
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంది. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల తన అన్నలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లకు రాఖీలు కట్టిన ఫోటోలని అన్ లైన్ లో షేర్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.      
 
"I felt a little extra loved this Rakhi… My forever one-stop solutions! @varunkonidela7 @alwaysramcharan
Can’t be more grateful to the stars for making me your Chelli" అంటూ నిహారిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.