1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 23 అక్టోబరు 2021 (13:00 IST)

సర్కారు దవాఖానాలో డెలివరీ అయిన అడిషనల్ కలెక్టర్ ...శ‌భాష్!

ఉన్న‌తాధికారులు పేరుకు ఎన్నో నీతులు చెపుతారు... ప్ర‌భుత్వం అంత చేస్తోంది, ఇంత చేస్తోంద‌ని...కానీ వారు మాత్రం ప్ర‌యివేటు స్కూళ్ళు, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌ను ఆశ్ర‌యిస్తారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక లేడీ ఆఫీస‌ర్ త‌న నిజాయితీని, వ్య‌క్తిత్వాన్ని నిరూపించుకున్నారు. త‌ను సేవ‌లు అందించే జిల్లాలోనే ఒక ప్ర‌|భుత్వాసుప‌త్రిలో చేరి, డెలివ‌రీ అయి...ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు.
 
తెలంగాణ జిల్లా ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నిన్న పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి, డెలివరీ చేశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. త‌ల్లి బిడ్డ క్షేమం... త‌ల్లికి అప‌ర‌మిత‌మైన సంతోషం...!
 
 సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని , అందరికీ ఆదర్శంగా నిలిచారని అడిషనల్ కలెక్టర్ స్నేహలత ...శ‌భాష్! అని ప‌బ్లిక్  ఆమెను ప్రశంసిస్తున్నారు. అధికారులు ఇలా చేయ‌డం వ‌ల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు.