1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (14:48 IST)

కొన్ని విషయాల్లో నా తమ్ముడు పవనే కరెక్ట్ : చిరంజీవి

కొన్ని విషయాల్లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు, నడుచుకునే తీరు కరక్టేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన సోమవారం హైదరాబాద్ నగరంలో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
కొన్ని అంశాల్లో పవన్ కళ్యాణ్ స్పందించడం చూస్తుంటే సమంజసంగానే అనిపిస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ న్యాయం కోసమే పోరాడుతాడని, న్యాయం కోసమే వాదిస్తాడని, తాను కూడా అదే న్యాయం కోసం తాను కూడా పోరాడుతానని చెప్పారు. 
 
కానీ, తన తమ్ముడు వేగంగా స్పందిస్తే, తాను మాత్రం కొంత సమయం తీసుకుంటానని చెప్పారు. మన చిత్తశుద్ధి, నిజాయితీ సంయమనం విజయాలను అందిస్తాయని చెప్పారు. అంతేకాకుండా, కొందరు తమ బుద్ధులు చూపిస్తారన్నారు. కానీ, తన స్వభావం మాత్రం ఇతరులకు మంచి చేయడమేనని చెప్పారు.