శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (21:19 IST)

డిజే వెర్షన్ లో విడుదల అయిన భీమ్లా నాయక్ గీతం

Bhimla Nayak
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
 
"లాలా భీమ్లా…అడవి పులి”....డిజే వెర్షన్ లో ఈ రోజు విడుదల అయిన 'భీమ్లా నాయక్‘ గీతం.
 
‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గతనెల 7 వ తేదీన ఇదే "లాలా భీమ్లా అడవి పులి" గీతం విడుదల అయిన విషయం విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేసిందీ గీతం. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం.
2021 కి వీడ్కోలు పలుకుతూ..నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబరాన్ని తాకేలా చేసింది.
 
‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారు ను కలిగిస్తే మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.
 
‘భీమ్లా నాయక్‘ చిత్రం ఫిబ్రవరి 25,2022 న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.