శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (19:25 IST)

న్యూఇయర్ ట్రీట్: లాలాభీమ్లా DJ సాంగ్ విడుదల (video)

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో  పవన్​, పోలీస్​ అధికారిగా నటించారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. 
 
ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు విశేషాదరణ లభించింది. 
 
ఇప్పటికే ఈ సినిమాలోని 'లాలా భీమ్లా' పాటకు.. 36 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ నేపథ్యంలో ఇదే సాంగ్‌కు సంబంధించిన డీజే వర్షెన్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఫ్యాన్స్ కోరిక మేరకు న్యూఇయర్ సందర్భంగా ఈ డీజే పాటను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది.