గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (20:13 IST)

నిత్యామీనన్ పెళ్ళి చేసుకోబోతుందా? పెళ్లి కొడుకు ఎవరంటే?

చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను హీరోయిన్ నిత్యామీనన్ పెళ్ళి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని టాక్. నిత్యామీనన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి భార్య పాత్రలో కనిపించనుంది నిత్యామీనన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
మరోవైపు ఇప్పటికే నిత్యా మీనన్‌కి పెళ్లయిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇక ఆ వార్తలకు బలం చేకూరేలా నిత్యామీనన్ పరోక్షంగా చెప్పింది. ఆ హీరోకు పెళ్లైపోవడంతో ఇక లాభం లేదని మ్యారేజ్‌పై ఫోకస్ పెట్టింది. 
 
నిజానికి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగాలని నిత్యామీనన్ ముందు ప్లాన్ చేసుకుంది. కానీ ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిత్యామీనన్ డిసైడైందని.. అందుకే చెన్నై వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.