శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (18:08 IST)

తమిళ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్

తమిళ హీరో విక్రమ్‌కు కరోనా వైరస్ సోకింది. గత రెండు రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
 
అయితే, ఆయనకు సోకింది కరోనా వైరస్సా లేక ఒమిక్రాన్ వైరస్సా అనేది తెలియాల్సివుంది. ఇందుకోసం ఆయన శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ ఫలితాలు శుక్రవారం లేదా శనివారం వచ్చే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, తనకు కోవిడ్ వైరస్ సోకిందనీ, అందువల్ల తనతో కాంటాక్ట్ అయిన వారందరూ ఈ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఇకపోతే, తమ అభిమాన హీరోకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. విక్రమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.