బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (17:31 IST)

బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. ఆమెకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
కాగా, గత రెండు మూడు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతూ వచ్చిన కరీనాకు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా, ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా ఈ వైరస్ సోకింది. 
 
ఇదిలావుంటే, ఇటీవలే విశ్వనటుడు కమల్ హాసన్‌కు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. ఈ వైరస్ బారినుంచి ఆయన కోలుకుని, ప్రస్తుతం అని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.