శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (12:47 IST)

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభాపతి, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఇటీవల హైదరాబాద్ నగరంలోని శివారులో ఓ కళ్యాణ మండపంలో ఆయన మనవరాలు వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే, అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చి, వధూవరులను ఆశీర్వదించారు. 
 
ఈ నేపథ్యంలో పోచారం తాజాగా కరోనా వైరస్ బారినపడ్డారు. బుధవారం రాత్రి ఆయనకు జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.