గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (14:43 IST)

ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - పక్కపక్కనే నవ్వుకుంటూ...

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయిలో వుంది. ఈ అంశం ఇరు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మాడిపోయేలా వుంది. ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కోర్టులకెక్కుతున్నారు. అలాంటి జలవివాదం ఇరు రాష్ట్రాల మధ్య కాక రేపింది.
 
ఈ వివాదం తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదివారం ఒకే వేదికపై కనిపించారు. ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చొన్నారు. ముచ్చటించుకున్నారు. నవ్వుకున్నారు. ఈ దృశ్యాలు ఇపుడు మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలి స్నిగ్ధరెడ్డి వివాహ వేడుక ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. పోచారం మనవరాలిని ఏపీ సీఎం జగన్ ఓస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడికిచ్చి వివాహం చేశారు. 
 
దీంతో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్‌లో ఈ వివాహ ఘట్టం జరిగింది. ఈ వేడుక సాక్షిగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు. ఆ తర్వాత వరుడు రోహిత్ రెడ్డి, వధువు స్నిగ్ధ రెడ్డిలను ఆశీర్వదించారు. గ్రూపు ఫోటో దిగారు.