శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (19:54 IST)

మంత్రులతో కెసిఆర్ భేటీ- రెండు రోజుల్లో ఢిల్లీకి..

యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యాసంగిలో ధాన్యం కొంటారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలంటూ రెండు రోజులు డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. 
 
మరో వైపు కేంద్రం శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే హైదరాబాద్‌ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను సైతం ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
 
ఈ సందర్భంగా కేసీఆర్ శనివారం సాయంత్రం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదన్నారు. 
 
మొన్న ధర్నా చేసిన రోజున రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతాం అన్నారు. చివరి ప్రయత్నంగా ఢిల్లీకి వెళ్తున్నామని కేసీఆర్ అన్నారు. బహుశా రెండు రోజుల్లో తెలంగాణ రైతాంగానికి ధాన్యం కొనుగోలులో ఏ విషయం తేలిపోతుందన్నారు.