సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (21:39 IST)

జల మండలి ఉద్యోగులకు శుభవార్త... కేసీఆర్‌ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ జల మండలి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జల మండలి బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ పీఆర్సీ అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు కేసీఆర్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ఈ నెల నుంచే జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు కానుందని అధికారికంగా ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 
 
నవంబరు మాసం నుంచే పెంచిన వేతనాలను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్‌. గత కొన్ని నెలలు గా జల మండలి ఉద్యోగులు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.