శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 15 నవంబరు 2021 (15:43 IST)

ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్ధిక ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా త‌యార‌వుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఈ విష‌యాన్ని గుంటూరులో మీడియాకు తెలిపారు.
 
 
ఉద్యోగులు ఆస్పత్రి వెళ్లేందుకు హెల్త్ కార్డులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశమైంది. ఇందులో పాల్గొన్న బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కోట్ల రూపాయ‌ల్లో వైద్య బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేద‌ని వివ‌రించారు. 
 
 
గత నెలలోనే పీఆర్సీ అమలు చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామ‌కృష్ణా రెడ్డి చెప్పార‌ని, అయినా ఇప్ప‌టికీ స్పంద‌న లేద‌ని చెప్పారు. ఎన్నికల్లో సీఎం జ‌గ‌న్ ఇచ్చిన హామీలను అమలు చేయాల‌ని, ఆయ‌నే జోక్యం చేసుకొని వెంటనే పీఆర్సీ అమలు చేయాల‌ని డిమాండు చేశారు. నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే, ఈ నెల 27, 28 తేదీల్లో కార్యాచరణ ప్రకటిస్తామ‌ని, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేద‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని బండి శ్రీనివాసరావు అన్నారు.