మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (15:23 IST)

సుమంత్ కొత్త చిత్రం - అహం రీబూట్ ప్రారంభం

Sumanth Aham Reboot pooja
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా `అహం రీబూట్`. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అహం రీబూట్ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకులు చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు. 
 
సుమంత్ ఆర్జే క్యారెక్టర్ లో కనిపించనున్న అహం రీబూట్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని చెబుతున్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్, ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని చెబుతున్నాం అన్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
 
సంగీతం - శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ - వరుణ్ అంకర్ల, స్క్రిప్ట్ సూపర్ విజన్ - సుమ కార్తికేయ, ప్రొడక్షన్ డిజైన్ - ఏఆర్ వంశీ, సౌండ్ - నాగార్జున తాళ్లపల్లి, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు, రచన దర్శకత్వం - ప్రశాంత్ సాగర్ అట్లూరి.