గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (14:08 IST)

భూమికను చూడ‌గానే భ‌లేవుందిరా అనిపించిందిః సుమంత్ అశ్విన్‌

sumanth- bhumika
న‌టి భూమిక‌ను చూడ‌గానే ఎంతో బాగా న‌చ్చింద‌నీ, భ‌లే ఉందిరా అనిపించింద‌ని న‌టుడు సుమంత్ అశ్విన్ తెలియ‌జేశాడు. అలాంటి భూమిక‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ రావ‌డం ఊహించ‌లేద‌ని తెలియ‌జేస్తున్నాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న సినిమా `ఇదేమాక‌థ‌` సినిమాలో ఆమె న‌టించింది. ఈ సంద‌ర్భంగా ఆమెతో త‌న‌కు గ‌ల అనుభ‌వాల‌ను తెలియ‌జేస్త‌న్నాడు.

 
భూమిక‌గారు `యువ‌కుడు` అనే సినిమాలో న‌టించారు. తొలి సినిమా ఆమెకు. నేను ఆ సినిమాను ఫిలింఛాంబ‌ర్ ప్రివ్యూథియేట‌ర్లో చూశాను. ఆమెను చూడ‌గానే `అబ్బ భ‌లే వుంద‌నుకున్నా. అప్పుడు ఫ‌స్ట్ క్ర‌ష్ కాక‌పోయినా బాగుంద‌నిపించింది.`నువ్వు నాకు న‌చ్చావ్‌`లోనూ ఆర్తి అగ‌ర్వాల్‌ను కూడా చ‌ూస్తే అలానే అనిపించేది. మా బేన‌ర్‌లో `ఒక్క‌డు` సినిమాలో భూమిక న‌టించింది.

 
అలాంటి భూమిక‌తో క‌లిసి నేను న‌టిస్తాన‌ని అస్స‌లు అనుకోలేదు. ఆవిడ సెట్‌కు వ‌స్తే షాట్ అయ్యాక బ్రేక్ టైంలో బుక్స్ చ‌దువుతుండేది. ఈ సినిమాలో ఆమెను అక్క అక్క అని పిలుస్తుంటాను. ఈ సినిమా బైక్ రేస్ నేప‌థ్యంలో సాగుతుంది. ఓ సంద‌ర్భంలో భూమిక‌గారు నా బైక్ ఎక్కుతారు. ఆమె ఎక్క‌గానే ఒక్కసారిగా గూస్ బ‌మ్స్ వ‌చ్చాయి. అంటూ సుమంత్ వివ‌రించారు.