గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (21:51 IST)

బాత్రూంలో సీక్రెట్ కెమెరా, 20 మంది యువతుల నగ్న వీడియోలు తీసి...

హోటల్ లోని లేడీస్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చి యువతుల నగ్న వీడియోలను చిత్రీకరించి వాటిని కంప్యూటర్లో పొందుపరుస్తూ స్నేహితులకు పంపిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులు.
 
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టు ఉంది. ఎంతోమంది ధనికులు ఈ హోటల్‌కు వస్తుంటారు. యువతులు వెళ్ళే రెస్ట్ రూంలో ఏకంగా ఒక సీక్రెట్ కెమెరాను అమర్చాడు హౌస్ కీపర్ బెనర్జీ. 
 
గత రెండునెలలుగా ఈ తతంగం సాగుతోంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తన సెల్ ఫోన్‌ను అక్కడ అమర్చి యువతుల నగ్న వీడియోలు రికార్డ్ అయిన తరువాత వాటిని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి కంప్యూటర్లో నిక్షిప్తం చేసి వాటిని స్నేహితులను ఒక్కొక్కటిగా పంపిస్తూ ఉండేవాడు బెనర్జీ.
 
అయితే నిన్న ఒక యువతి సెల్ ఫోన్‌ను గమనించి హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెనర్జీ ఇంటిలోని కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.