మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:18 IST)

మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా: హైదరాబాదులో కలకలం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ ఫుడ్ కోర్టులో మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా కలకలం రేపింది. ఫుడ్ కోర్టుకి వెళ్లిన ఓ మహిళ వాష్‌రూమ్‌కి వెళ్లగా... అక్కడ ఓ మూలకు సెల్‌ఫోన్ కనిపించింది. 
 
సెల్‌ఫోన్ అక్కడెందుకు ఉందా అని చూడగా... దాని కెమెరా ఆన్ చేసి ఉన్నట్లు గుర్తించింది. మహిళలను ఆ సెల్‌ఫోన్‌తో రహస్యంగా చిత్రీకరిస్తున్నట్లు గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 
 
ఫుడ్ కోర్టులో బాత్‌రూమ్ క్లీనర్‌గా పనిచేస్తున్న బెనర్జీనే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న ఆ మహిళ బాత్‌రూమ్‌లో కెమెరాను గుర్తించేవరకూ... అది రికార్డు మోడ్‌లోనే ఉన్నట్లు గుర్తించారు. బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.