బెడిసికొట్టిన వర్మ ఫొటో ఇంటర్వ్యూ
Varma-Ashu reddy
ఆ భాగంలోనే బిగ్ బాస్ ఫైనలిస్ట్ అరియానాతో చేసిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో అదే దూకుడుతో అషురెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. దానిపై పలు విమర్శలు వచ్చినా. అది నా ఇష్టం. లా ప్రకారం నేను చేస్తున్నానంటూ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పాడు. పైగా ఇలాంటి బోలెడు వస్తాయంటూ నిర్మొహమాటంగా చెప్పాడు. అయితే ఈ ఇంటర్వ్యూ ఇషూ రెడ్డి మదర్ కూడా ఓకే అందని చెప్పాడు. కానీ ఆయన మాటకు విరుద్ధంగా ఇషురెడ్డి కుటుంబం వర్మపై తీవ్రంగా విరుచుకుపడ్డారని తెలుస్తోంది. బిగ్ బాస్ తర్వాత వెండితెరపై వెలగాలని అషు ఆశపడిన మాట వాస్తమే. కానీ ఇలా అయితే పూర్తి నెగెటివ్ పేరు వస్తుందేమోనని భయంతో వున్నారు. ఇకపై వర్మ సినిమాల్లో కూడా నటించవద్దని కుటుంబీకులు చెప్పినట్లు సమాచారం.
