1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nayanthara throws a surprise birthday bash for Vignesh Shivan's 36th birthday

థ్యాంకూ బంగారం.. సర్‌ప్రైజ్ ఇచ్చిన నయనకు విఘ్నేశ్ శివన్

Nayanthara
Vicky_Nayanatara
గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నయన్‌-విఘ్నేశ్‌లు ఇటీవలె నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే ముహూర్తం తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తనకు కాబోయే భర్త విఘ్నేశ్ శివన్‌కు బర్త్ డే సర్‌ప్రైజ్ ఇచ్చింది. 
 
శనివారం విఘ్నేశ్‌ 36వ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్‌ పార్టీతో ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాను షేక్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఫోటోలను షేర్ చేసిన విక్కీ.. "నీ ఉనికి నా జీవితంలో ఏ బహుమతితో పోల్చలేనిది.. థ్యాంకూ బంగారం. నా బర్త్‌డేను మరింత స్పెషల్‌గా మార్చినందుకు.." అంటూ నయన్‌పై ప్రేమ కురిపించాడు.
 
ఇక తన పుట్టినరోజుకు విషెస్‌ తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా తాను దర్శకత్వం వహిస్తున్న కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుందని ప్రకటించాడు. కాగా ఈ సినిమాలో నయనతారతో పాటు సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.
తర్వాతి కథనం
ఇర‌వై ఏళ్ళ స‌త్య‌మూర్తి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అన్న‌య్య ఎలా అయ్యాడు!